రామతీర్థంలో ఉద్రిక్తత.. విజయసాయిరెడ్డి ఫిర్యాదు

by srinivas |
mp vijayasaireddy
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామాలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రామతీర్థం దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామతీర్థం కొండ తనపై రాల్లు, వాటర్ ప్యాకెట్లతో దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతేగాకుండా చంద్రబాబు, అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లోనే తనపై దాడి జరిగిందని అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు.

Next Story

Most Viewed