- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ వీడుతున్నారనే వాయిదా నాటకం: విజయసాయిరెడ్డి
పచ్చ పార్టీ నేతలు పెళ్లిళ్లు, పేరంటాల పేరిట బాగానే తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన విజయసాయిరెడ్డి.. పార్టీ నుంచి కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుంటే భయపడి ఆరువారాల వాయిదా నాటకాన్ని తెరమీదికి తెచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కరోనా భయం అంటున్నారు, మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు, ఎన్నికలు వాయిదా అనగానే సంబరాలు చేసుకుంటున్నారు.. ఎలక్షన్లకు మాత్రమే కరోనా అంటున్నారు… టీడీపీ వ్యవహారం దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలను వాయిదా వేయించిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినట్టు ఫీలవుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ.. మళ్లీ ఎన్నికలు జరుగుతాయి అంటూ ఆయన హితవు పలికారు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు చరమగీతం పాడే రోజు దూరంలో లేదని ఆయన అన్నారు.
tags : ysrcp, tdp, vijayasai reddy, chandrababu, twitter