- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kadiri: కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: కదిరి (Kadiri) వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా (Attar Chand Basha) పై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాలను తయారు చేస్తుండటంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 లోనే చాంద్ బాషా నకిలీ పట్టాలు తయారు చేసినట్లు తేలింది. మాజీ ఎమ్మెల్యే, ఆర్ఐ గా పనిచేసిన మున్వర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్ బాషా ప్రోత్సాహంతోనే నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా అతను అంగీకరించాడు. నకిలీ పట్టాలు (Fake Documents) తయారు చేసేందుకు రూ.20 లక్షలు లంచం కూడా తీసుకున్నాడు. అయితే తాను అంత లంచం ఇవ్వలేనని, రూ.11 లక్షలు ఇచ్చానని సోమ్లానాయక్ అనే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. నకిలీ పట్టాల తయారీ వెనుక ఉన్న ప్రధాన హస్తం చాంద్ బాషా అని తేలడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మున్వర్ నుంచి 39 నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నామని, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని సీఐ నారాయణరెడ్డి తెలిపారు.