- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమీర్ నన్ను తప్పించడమేంటి?.. ఆయన కథలు బాగా చెప్తాడు : సేతుపతి
దిశ, సినిమా : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా నుంచి సౌత్ స్టార్ విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. క్యారెక్టర్‌కు తగినట్లుగా సేతుపతి వెయిట్ తగ్గలేకపోయాడనే, తనను మేకర్స్ సినిమా నుంచి తప్పించారని రూమర్స్ వచ్చాయి. దీంతో అమీర్, సేతుపతి మధ్య క్లాషెస్ వచ్చాయని.. అందుకే అమీర్ కూడా సేతుపతి నిర్మిస్తున్న కోలీవుడ్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’ రీమేక్ చేయలేనని చెప్పేశాడని న్యూస్ స్ప్రెడ్ అయింది.
కాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు సేతుపతి. ‘లాల్ సింగ్ చద్దా’ నుంచి తప్పుకోవడంలో బరువు పెరగడం, తగ్గడం లాంటి మ్యాటర్ లేదని స్పష్టం చేశాడు. అమీర్ ఖాన్ పర్సనల్‌గా తనకు ఈ రోల్ ఆఫర్ చేశారని, తమిళనాడులో తను షూటింగ్ స్పాట్‌లో ఉండగా ఈ కథ వివరించేందుకు అక్కడికి వచ్చారని చెప్పాడు. డైరెక్టర్ అద్వైత్ చందన్ రాలేకపోవడంతో అమీర్ స్వయంగా ఈ కథను తనకు నెరేట్ చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం అమీర్ ఆ రోజు నైట్ తమిళనాడులోనే స్పెండ్ చేశారని, ఆ తర్వాతి రోజు ముంబై వెళ్లారని చెప్పుకొచ్చాడు. అమీర్ మార్వెలస్ స్టోరీ టెల్లర్ అని, తను కథ చెప్పే విధానానికి మెస్మరైజ్ అయిపోయి వెంటనే ఓకే చెప్పినట్లు తెలిపాడు.
ఇంతకుముందు కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను కరోనా వల్ల అనుకున్న టైమ్‌కు కంప్లీట్ చేయలేకపోయామని.. ఈ కారణంగా తెలుగులో ఐదు సినిమాలు పెండింగ్‌లో పడిపోయాయని తెలిపాడు. వీటిని పూర్తి చేసే క్రమంలో ‘లాల్ సింగ్ చద్దా’కు డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు సేతుపతి. భవిష్యత్తులో అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, దీన్ని గౌరవంగా భావిస్తానని తెలిపాడు.