నా సినిమాలు చూసుకోవడం కన్నా మానేయడమే బెటర్: సేతుపతి

by Shyam |   ( Updated:2021-10-20 02:54:54.0  )
నా సినిమాలు చూసుకోవడం కన్నా మానేయడమే బెటర్: సేతుపతి
X

దిశ, సినిమా: సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఆయన ఎంచుకునే మూవీస్‌ యూనిక్‌గా ఉండటంతో పాటు తన యాక్టింగ్ అదిరిపోతుండటంతో చాలా కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయిన సేతుపతి.. తన సినిమాలు తను చూసుకునేందుకు భయపడుతుంటానని తెలిపాడు. నార్మల్‌గా మూవీస్ చూడటం అంటేనే ఇష్టముండదని.. ఇక తన సినిమాలు చూసుకుని అందులో తప్పులు వెతుక్కోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుందని తెలిపాడు. తను యాక్టర్ అని, ఆర్ట్ లేకపోతే తను నథింగ్ అన్న సేతుపతి.. డే టైమ్‌లో షూటింగ్‌లో పాల్గొనడం రాత్రి నిద్రపోవడం మాత్రమే తనకు తెలుసన్నాడు.

డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రమే తన సినిమా చూసుకుంటానని తెలిపాడు. ఒక సినిమాకు సంబంధించిన పని అయిపోయిందంటే అది గతమని నమ్ముతానని.. ఇక దాని గురించి ఆలోచించి, చూసి లాభం లేదని, అందుకే ప్రజెంట్ వర్క్‌పై కాన్సంట్రేట్ చేస్తానని వివరించాడు. తన గతమేంటి? ఎంత పెద్ద స్టార్? అనేది మ్యాటర్ కాదన్న ఆయన.. వర్క్ మాత్రమే తనతో ఎప్పటికీ ఉండిపోతుందని తెలిపాడు.

Advertisement

Next Story