కరోనాతో డాక్టర్ భీమన్న కుమార్తె విజయపల్లవి మృతి

by Shyam |   ( Updated:2021-05-27 00:10:54.0  )
కరోనాతో డాక్టర్ భీమన్న కుమార్తె విజయపల్లవి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బోయి భీమన్న కుమార్తె బోయి విజయ పల్లవి కరోనాతో మృతి చెందారు. సెంచరీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా కరోనా చికిత్స పొందుతుండగా.. ఆక్సిజన్ లెవల్ పడిపోవడంతో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 52 సంవత్సరాలు. కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమెకు భర్త లక్మణ్ (న్యాయవాది), కుమార్తె, తల్లి హైమవతి , చెల్లెలు విజయేందిర ఐఎఎస్, బావ లోకేష్ కుమార్ ఐఎఎస్ ఉన్నారు. విజయ పల్లవి చిన్నతనంలో భీమన్న పుస్తకాలకు శుద్ధ ప్రతులను తయారుచేస్తూ రచనా వ్యాసంగానికి తోడ్పడేవారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, పదవ సంపుటంలో వంద పుటలుపైగా అనువాదం చేశారు. ఈ ప్రాజెక్టు పనికోసం అంబేడ్కర్ భవన్‌కు భీమన్నతో పాటు హాజరయ్యేవారు. ఆమె ఎం.ఏ, ఎం ఫిల్, ఎల్.ఎల్.బి చేయగా.. రాష్ట్ర టెక్స్‌టైల్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ మధ్యనే డి.డిగా పదోన్నతి పొందారు.

Advertisement

Next Story

Most Viewed