పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను వెనక్కి నెట్టిన తమిళ్ స్టార్ హీరో..

by Shyam |
vijay
X

దిశ, వెబ్‌డెస్క్: 2021వ సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్వీట్లు చేయబడిన సౌత్ ఇండియన్ హీరోల జాబితాను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియా ఆదివారం ప్రకటించింది. టాప్ టెన్‌లో ఐదుగురు టాలీవుడ్ హీరోలు ఉన్నారు. వీరిలో తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ మెుదటి స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను విజయ్ వెనక్కినెట్టడం విశేషం. మొదటి స్థానంలో విజయ్ నిలువగా.. రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్, మూడవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. జై భీమ్ హీరో సూర్య నాలుగోవ స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరుసగా ఐదు, ఆరవ స్థానంలో నిలిచారు. తమిళ తలైవ రజనీకాంత్ ఏడవ స్థానం దక్కించుకున్నారు. రామ్ చరణ్, ధనుష్, అజిత్ కుమార్‌లు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed