మహేష్ బాబు రూట్‌లో రౌడీ హీరో..

by Shyam |
మహేష్ బాబు రూట్‌లో రౌడీ హీరో..
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో అచీవ్‌మెంట్ సాధించాడు. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్‌తో స్టార్ రేంజ్‌కు దూసుకుపోయిన విజయ్.. ప్రజెంట్ పూరి జగనర్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు హీరో. ‘యాక్టర్ కావాలనే డ్రీమ్ నుంచి ఓన్ మల్టీప్లెక్స్ పెట్టుకునే రేంజ్‌కు ఎదిగాను’ అని తెలిపాడు. తన సొంతూరు మహబూబ్‌నగర్‌లో ఈ నెల 24న AVD సినిమాస్ (ఏసియన్ విజయ్ దేవరకొండ సినిమాస్) స్టార్ట్ కాబోతోందని ప్రకటించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ మూవీతో AVD సినిమాస్ ప్రారంభం కావడం మరింత ఆనందంగా ఉందని తెలిపాడు. తన మొదటి చిత్రం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశారని, ఇప్పుడు తన డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ద్వారానే తన మల్టీప్లెక్స్ ఓపెన్ కావడం సూపర్ హ్యాపీ అని చెప్పాడు విజయ్.

Advertisement

Next Story

Most Viewed