- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విజయ్ – సుక్కు’ కాంబినేషన్.. బ్లాక్ బస్టర్ లోడింగ్
దిశ, వెబ్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ అమేజింగ్ అనౌన్స్‌మెంట్ చేశాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్.. తన నెక్స్ట్ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ఉండబోతున్నట్లు ప్రకటించాడు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపాడు.
2022లో రాబోతున్న సినిమా కోసం తనలోని యాక్టర్ సూపర్ ఎగ్జైట్‌గా ఉన్నాడని తెలిపిన విజయ్.. ఈ వార్త విని తనలోని ప్రేక్షకుడు పండగ చేసుకుంటున్నాడని చెప్పాడు. మెమొరబుల్ సినిమా ఇస్తామని అభిమానులకు ప్రామిస్ చేసిన రౌడీ హీరో.. సుక్కు సార్‌తో సెట్స్‌లో ఉండేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత కేదార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్.. ‘నువ్వు మంచి స్నేహితుడివి, నీ హార్డ్ వర్క్ ఫ్యూచర్‌లో నిన్ను సక్సెస్‌ఫుల్ నిర్మాతగా నిలబెడుతుంది’ అని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక కలలోనూ సుకుమార్ – విజయ్ కాంబినేషన్ ఊహించుకోలేదంటున్న విజయ్ ఫ్యాన్స్.. బ్లాక్ బస్టర్ బొమ్మ పడినట్లే అని పండగ చేసుకుంటున్నారు.