సౌత్ ‘సోషల్’ హీరో.. ఈ రౌడీహీరో

by Shyam |
సౌత్ ‘సోషల్’ హీరో.. ఈ రౌడీహీరో
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు సినిమాతో ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకుని అర్జున్ రెడ్డితో రౌడీ‌హీరో అయిపోయాడు. అర్జున్ రెడ్డి మానియా నుంచి ప్రేక్షకులు ఇంకా బయటకు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత విజయ్ ఏ మూవీ చేసినా దానితో పోల్చడం అలవాటు అయిపోయింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా తర్వాత విజయ్ … భారీ స్టార్‌డమ్ పొందాడు. విజయ్ యాటిట్యూడ్ కూడా ఫ్రెండ్లీగా ఉండడం, అది యూత్‌కు నచ్చడంతో కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలతో హిట్ కొట్టి.. డియర్ కామ్రేడ్ సినిమాతో తెలుగుతోపాటు తమిళ, మలయాళం, కన్నడ రంగాల్లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కోసం విజయ్ చేసిన ప్రమోషన్స్ అక్కడి అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం సౌత్ ఇండస్ట్రీ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు.

సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ… ఇక్కడ కూడా తన మార్క్‌ను చూపించాడు. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు దక్కని గౌరవాన్ని పొందాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ స్టార్స్‌ను దాటేసి ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో సౌత్ సోషల్ మీడియా స్టార్‌గా నిలిచాడు. ఇప్పుడు ఎలాగూ కరణ్ జోహర్ నిర్మాణ సారధ్యంలో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు కాబట్టి… అక్కడ కూడా ఇదే స్టార్‌డమ్ పొందడం.. 10 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించడం త్వరలోనే ఉందంటున్నారు రౌడీ ఫ్యాన్స్. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు 158 పోస్ట్‌లు పెట్టిన ఈ రౌడీ బాయ్ మాత్రం ఏ ఒక్కరినీ ఫాలో అవడం లేదు.

Advertisement

Next Story

Most Viewed