- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్య చిత్రంపై విజయ్ కాంప్లిమెంట్స్..
దిశ, వెబ్‌డెస్క్: సూర్య, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా సుధా కొంగర డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కూడా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాపై స్పందించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో సినిమా చూశానని.. అందులో ముగ్గురు ఏడ్చారు అని చెప్పాడు. సినిమా చూస్తూ ఆవేశానికి గురయ్యాను అని.. బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్టేట్‌మెంట్ ఇచ్చి.. దాన్ని చేసి చూపించాడన్నాడు విజయ్. సూర్య అన్న టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. యాక్టర్‌గా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తను .. నిర్మాతగాను బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడన్నాడు.
https://twitter.com/TheDeverakonda/status/1328326758043582464?s=20
ఇక హీరోయిన్ అపర్ణ బాలమురళిని చూసి ఆశ్చర్యం వేసిందన్నాడు విజయ్. సుధా ఈ అమ్మాయిని తన సినిమాలో నటించేందుకు ఎలా కనుగొందో కానీ.. రియల్ అండ్ కమాండింగ్ యాక్టర్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. సుధా కొంగరతో త్వరలో కలిసి పనిచేస్తానన్న విజయ్.. ఇది దర్శకురాలిగా మీ పట్ల నాకున్న అభిమానాన్ని తెలుపుతుందన్నారు. జీవీ ప్రకాశ్ టాప్ క్లాస్ మ్యూజిక్, నికేత్ బొమ్మి గ్రేట్ సినిమాటోగ్రఫి సినిమాకు చాలా చాలా ప్లస్ అయిందన్నారు.
@Sudhakongara_of – I will work with you soon 🙂 This is me professing my admiration for you as a director.
Top class music by @gvprakash, great cinematography by @nikethbommi and so many great performances by the supporting cast!
— Vijay Deverakonda (@TheDeverakonda) November 16, 2020
‘సింప్లి ఫ్లై’ ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఎంత నిజమో, ఎంత ఫిక్షనలైజ్డ్ అనేది తెలియదు కానీ.. ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథన్ జర్నీ గురించి మరింత తెలుసుకునేందుకు ‘సింప్లి ఫ్లై’ బుక్ ఆర్డర్ చేస్తానని తెలిపాడు. తెలుగు, తమిళ్‌లో డెఫినెట్‌గా చూడాల్సిన చిత్రం అని చెప్పాడు.
I dont know how much is true and how much fictionalised – so ordering the book #SimplyFly to read more about Captain's journey… Also Fck people like Paresh Goswami 🙂 Definite watch in Telugu or Tamil – cheers!
— Vijay Deverakonda (@TheDeverakonda) November 16, 2020