మండుటెండలో 25 కి.మీ నడిచిన హీరోయిన్

by Shyam |
మండుటెండలో 25 కి.మీ నడిచిన హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కెరియర్ స్టార్టింగ్ డేస్ గుర్తుచేసుకుంది. ఆడిషన్స్‌లో రిజెక్ట్ కావడంతో నిద్రలేని రాత్రులు గడిపానని, ఏడుస్తూనే ఉండేదాన్నని గుర్తుచేసుకుంది. 1995 ‘హమ్ పాంచ్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్య ‘పరిణీత’ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2002-03 మధ్యలో బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ రిజెక్షన్‌కు గురైనట్లు చెప్పింది. ముంబైలో ఓ సినిమా ఆడిషన్ కోసం అటెండ్ అయినా రిజెక్ట్ కావడంతో ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు అంటే 25 కిమీ మండుటెండలో నడస్తూనే ఇంటికి వెళ్లానని తెలిపింది. సినిమా చాన్స్‌లు రావడం లేదన్న కోపంలో అలా చేశానని, దాహం-ఆకలి లాంటివి దరిచేరవని వివరించింది. ఇప్పుడైతే బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్‌లో భాగంగా అలా చేస్తానేమో కానీ అప్పుడు మాత్రం కోపంలోనే ఏమీ ఆలోచించకుండా అలా నడుస్తూ వెళ్లిపోయానని చెప్పింది.

Advertisement

Next Story