- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డర్టీ పిక్చర్‌లో సౌందర్యం ఉంటుందని నమ్మాను : విద్యా బాలన్
హీరోయిన్ విద్యా బాలన్ ఏ సినిమా చేసినా సరే, అందులో కొత్తదనం ఉంటుంది. ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేస్తుంటుంది. తాజాగా ‘శకుంతలా దేవి’ సినిమా ద్వారా నటిగా మరోసారి ప్రశంసలు అందుకున్న విద్య.. తాజా ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌ను అసలు ఎందుకు ఒప్పుకుందో తెలిపింది.
నిర్మాత ఏక్తాకపూర్ మీద నమ్మకం.. డైరెక్టర్ మిలాన్ టేకింగ్‌లో ఉన్న సౌందర్యం గురించి తెలిసి వివాదాస్పద చిత్రం ‘డర్టీ పిక్చర్’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ‘మిలాన్ తీసే చిత్రం అందంగా ఉంటుందని నమ్మాను. సినిమా ఒప్పుకున్నప్పుడు తనకేమైనా పిచ్చి పట్టిందా అని అందరూ అనుకున్నా.. అవేవీ పట్టించుకోలేదు’ అని తెలిపింది. ఈ విషయంలో తల్లిదండ్రులను అభిప్రాయం అడిగితే.. నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఫాలో అవమని చెప్పారని వెల్లడించింది. తన నమ్మకమే నిజమై ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న విద్య.. డర్టీ పిక్చర్ తర్వాతే మంచి ప్రాజెక్టులు పొందిందని అంటుంటారు విశ్లేషకులు.