- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జంపింగ్ క్యాట్స్.. అమేజింగ్ ఫీట్!
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా విప్లవంతో ప్రపంవ్యాప్తంగా ఏ మూలాన ఏది జరిగినా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు గంటల వ్యవధిలోనే వైరల్ అవుతున్నాయి. అలాంటిదే క్యాట్స్ జంపింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గనుక చూస్తే మీకు కూడా గ్యారెంటీగా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇంతకీ ఆ పిల్లులు ఎలా జంప్ చేశాయో తెలుసా?
భూమ్మీద నుంచి వాల్‌పైకి జంప్ చేసిన రెండు పిల్లులు, అక్కడ్నుంచి ఎదురుగా ఉన్న మరో గోడపైన ఒకేసారి ల్యాండ్ అయ్యాయి. జనరల్‌గా మనం రెండింటి ల్యాండింగ్‌లో స్వల్ప తేడాలుంటాయనుకుంటాం. కానీ, ఈ రెండు పిల్లులు ఒకే టైమ్‌లో ఎగ్జాక్ట్‌గా ఈ ఫీట్ చేశాయి. కాగా కొన్ని గంటల కిందట ఓ యూజర్ అమెరికన్ వెబ్‌సైట్ రెడ్డిట్‌లో వీడియోను షేర్ చేయగా, కేవలం 4 సెకండ్లున్న ఈ వీడియో వైరల్‌గా మారి 1,200 అప్‌వోట్‌లను సంపాదించింది. కాగా ఈ పిల్లులు ఆలస్యంగానైనా మంచి ఎలుకలు పట్టుకున్నట్లున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, ఈ ఫీట్‌ను ఒలింపిక్స్‌లో క్రీడగా చేర్చాలని మరో నెటిజన్ సూచించాడు.