రాష్ట్రంలో ‘కరోనా’ పరికరాల తయారీకి అనుమతించండి

by Shamantha N |   ( Updated:2020-03-26 07:38:29.0  )
రాష్ట్రంలో ‘కరోనా’ పరికరాల తయారీకి అనుమతించండి
X

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌కి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరోనా వైరస్ పేషంట్స్‌కి చికిత్స అందించే సమయంలో ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్, ఐసీయు పరికరాలు హైదరాబాద్‌లోనున్న డీఆర్‌డీఓ, బీడీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థల్లో తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఈటల కోరారు. మందులు, వైద్య పరికరాలు, నిత్యావసర వస్తువులు రాష్ట్రాల సరిహద్దులు దాటేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెంటనే అనుమతి మంజూరు చేయాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. ఎన్-95 మాస్కులు, పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్,వెంటిలేటర్స్ అందించాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవి అని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఆబ్జర్వేషన్‌లో ఉంచాలని, హోమ్ క్వారంటైన్ నుంచి బయటికి రాకుండా చూడాలని కోరారు. ఆశా వర్కర్లు కి ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రకటించారు. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా చూసుకోవాలని సూచించారు.

Tags : coronavirus outbreak, lockdown, meeting to central minister with ts minister Etela

Advertisement

Next Story

Most Viewed