- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సారూ.. మా భూమిని లాక్కున్నారు.. మీరే న్యాయం చేయాలి
దిశ, మానకొండూరు: ‘మా కుటుంబానికి చెందిన భూమిని మాకే తెలియకుండా మరొకరు పట్టా చేసుకున్నారు సారూ.. ఇదేంటని అడిగితే ఇబ్బంది పెడుతున్నారు.. మాకు మీరే న్యాయం చేయాలంటూ ఓ కుటుంబం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో మొరపెట్టుకున్నారు. ఆదివారం కేశపట్నం మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేతో బాధిత కుటుంబం గోడు వెల్లబోసుకుంది.
బాధితుడు బొజ్జలిత సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ‘మాకు కేశవపట్నం శివారులో సర్వే నం 532 ( ఏ ) లో 12 గుంటల భూమి ఉంది. ఆ భూమిని మొలంగూర్ గ్రామ సర్పంచ్ మోరే అనూష భర్త శ్రీనివాస్(న్యాయవాది).. గాజ్జుల శ్రీనివాస్(వైన్ షాపు యజమాని)తో చేతులు కలిపాడు. వారికి అనుకూలంగా వైన్ షాపు ఓనర్ పేరు మీద పట్టా చేయించుకున్నారు. ఇదేంటని అడిగితే ఇబ్బంది పెడుతున్నారు అంటూ సమ్మయ్య వాపోయాడు. తన స్థలాన్ని ఇప్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నట్టు చెప్పుకొచ్చాడు.