- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓరి నీ వేషాలో.. బాండ్ పేపర్ రాసి మరీ మోసం చేస్తారా..

దిశ ,పర్వతగిరి: మండలంలోని రావురు గ్రామానికి చెందిన 25మంది రైతులను శ్రీరామ బయోసిడ్ కంపెనీ నమ్మించి మోసం చేసింది. బాసుమతి సిడ్స్ అధిక దిగుబడి ఉంటుందని ,ఎకరాని యాబై వేల రూపాయలు లేదంటే తక్కువ పంట పండిన యాభై వేలు ఇస్తామని అన్నారు. అలాగే యాబై రూపాయల బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ పత్రాలు రాసి ఇచ్చారు. శ్రీరామ బయోసిడ్ కంపెనికి చెందిన యండి.జాని,పి.రాజులు స్థానిక రైతు బట్టు చక్రు నాయక్ ను మధ్యవర్తిగా ఉంచి డబ్బులు ఇవ్వకుండా నానా అవస్థలు పెడుతున్నారని రైతులు స్థానిక సిఐ రాజగోపాల్ ఎస్సై ప్రవీణ్ వద్ద వాపోయారు. బాధిత రైతులు గోలుసుల రాజు ఆవార్ల రవి,పోన్నాల కోమ్మాలు,వెల్పుల భాస్కర్, కోమ్ము దర్గయ్య,బాబు,ధరవత్ వెంకన్న,బానోత్ భద్రు బందారపు సంపత్,నోముల శ్రీకాంత్,నోముల ఐలయ్య బానోతు యాకాంబ్రంలు కలిసి సంబంధిత కంపెనీ యాజమాన్యంపై మరియు జాని, రాజు లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
రైతులు జాగ్రత్తగా ఉండాలి- సిఐ రాజగోపాల్
కొన్ని బయోసిడ్ కంపెనీలు నాసిరకం విత్తనాలతో,ఎరువులతో రైతులను మభ్యపెట్టి సిజన్ కు ఓ రకమైన కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు జాగ్రత్తలు వహిస్తూ స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు ,సూచనలు పాటించాలని సిఐ అన్నారు. కొత్తరకం విత్తనాలు,ఎరువులు తిసుకునే ముందు దళారుల మాటలు నమ్మకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి..సలహాలు పాటించాలన్నారు. రైతులను మోసం చేసే దళారులుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో రైతులను మోసం చేసిన వారిపై పిడి యాక్ట్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.