Pawan Kalyan: రేపు 'అడవి తల్లి బాట’కు పవన్​ శ్రీకారం

by Anil Sikha |
Pawan Kalyan: రేపు అడవి తల్లి బాట’కు పవన్​ శ్రీకారం
X

దిశ, ఏపీ బ్యూరో : గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం (AP Government) శ్రీకారం చుట్టనుంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (DCM Pawan)సంకల్పించారు. దీని కోసం అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్​ కల్యాణ్​ చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి, అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఎకో టూరిజంపై సమీక్ష

8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్టకు పవన్​ కల్యాణ్​ చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై (Echo tournism) సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కల్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు

Next Story

Most Viewed