అల్లు అర్జున్-అట్లీ సినిమా ఫిక్స్.. షాకింగ్ సర్‌ప్రైజ్ వచ్చేస్తుందంటూ క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత (ట్వీట్)

by Hamsa |
అల్లు అర్జున్-అట్లీ సినిమా ఫిక్స్.. షాకింగ్ సర్‌ప్రైజ్ వచ్చేస్తుందంటూ క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత (ట్వీట్)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐకాన్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో కూడా ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే కథ కూడా ఓకే కావడంతో షూటింగ్ కూడా మొదలు పెట్టే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ వార్తల గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రియులంతా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, టాలీవుడ్ నిర్మాత, బన్నీ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘షాకింగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది.. ప్రీపేర్ అయి ఉండండి.. ఏప్రిల్ 8న అప్డేట్ రానుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా రెండు స్టార్ ఎమోజీలు, ఫైర్ బొమ్మలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా.. అట్లీ సినిమా అప్డేట్ ద్వారా అధికారికంగా ప్రకటించనున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోతుంది. అయితే ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు టాక్. ఇక ఐకాన్ స్టార్ అభిమానులు, సినీ ప్రియులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed