- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ రెండిటి దర్శన భాగ్యం నాకు దక్కింది.. శ్రీలంక పర్యటన అనంతరం మోడీ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ట్విట్టర్ (Twitter) లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుండి తిరిగి వస్తుండగా, రామసేతు దర్శనం (Ramasetu Darshan) చేసుకునే అదృష్టం తనకు కలిగిందని చెప్పారు. అంతేగాక దైవిక యాదృచ్చికంగా, అయోధ్యలో సూర్య తిలకం (Ayodya Surya thilakam) జరుగుతున్న సమయంలోనే ఇది జరిగిందని అన్నారు. రెండిటి దర్శనం చేసుకునే అదృష్టం తనకు లభించిందని తెలిపారు. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి అని, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తున్నట్లు మోడీ రాసుకొచ్చారు.
కాగా ప్రధాని మోడీ మూడు రోజుల పాటు శ్రీలంక పర్యటన (Srilanka Tour)కు వెళ్లారు. పర్యటన అనంతరం ఇవాళ విమానంలో తమిళనాడు (Tamilnadu)కు చేరుకొని, రామేశ్వరం (Rameshwaram)లో నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జి (Pmaban Railway Bridge)ని ప్రారంభించారు. రూ. 535 కోట్లతో నిర్మించిన ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి (Vertical Lift Sea Bridge)ని మోడీ జాతికి అంకితం చేశారు. దాదాపు 2.08 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని, భారత భూబాగంతో అనుసందానం చేస్తుంది. ఈ బ్రిడ్జిను అదునాతన వర్టికల్ లిఫ్ట్ మెకానిజంతో రూపొందించడం వల్ల ఓడలు దీని కింద నుంచి సులువుగా ప్రయాణించే వీలు ఉంటుంది. 72 పిల్లర్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి్కి సముద్రంపై 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునే శక్తి ఉంటుంది.