న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా..

by Anukaran |   ( Updated:2020-10-08 08:29:57.0  )
న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
X

దిశ, వెబ్‌డెస్క్ : శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ప్రసాద్ మీడియాకు వెల్లడించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన జరిగి మూడు నెలలు గడచిందని అయినా, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల నా చావు కబురు వినాల్సి వస్తుందని ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

Advertisement

Next Story