- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రినా పెళ్లి చీర డిజైన్‌కు 75 రోజులు.. కాస్ట్, డిజైనర్స్ ఎవరో తెలుసా?
దిశ, సినిమా: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహం జరిగేంత వరకు శుభకార్యానికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ ఈ జంట.. పెళ్లి తర్వాత ఒక్కొక్కటిగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మ్యారేజ్ స్పెషల్స్, డ్రెస్సింగ్, తదితర విషయాల గురించి పంచుకుంటున్న నటి.. తాజాగా తన పెళ్లి చీర గురించి ఆసక్తికర విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పొడవాటి పైట కొంగుతో యువరాణిలా దర్శనమిచ్చిన బ్యూటీ… సబ్యసాచి డిజైనర్స్ ఈ చీరను రూపొందించినట్లు తెలిపింది.
సమంత బోల్డ్ లుక్స్.. రికార్డులు బద్దలు కొడుతున్నాయిగా!
‘కత్రీనా తల్లి బ్రిటీష్ వారసత్వానికి ప్రతీకగా ‘వింటేజ్ ఇన్‌స్పైర్డ్ కౌచర్ శారీ’ని రూపొందించాం. బెంగాల్ నుంచి వచ్చిన హస్తకళాకారులు ఎంబ్రాయిడరీ చేయగా.. రత్నాలు, స్ఫటికాలను ఉపయోగించాం. అలాగే సబ్యసాచి హెరిటేజ్ జ్యువెల్లరీ నుంచి సరిపోయే చెవిపోగులలు, లైట్ రష్యన్ ఎమరాండ్స్‌తో చేసిన అన్‌కట్ డైమండ్ చోకర్‌ను ఈ చీరకు జత చేశాం. మొత్తంగా ఈ ప్రీ వెడ్డింగ్ పాస్టెల్-పింక్ చీర కోసం 75 రోజుల్లో 40 మంది కళాకారులు 1800 గంటల పాటు పని చేయాల్సి వచ్చింది’ అంటూ సబ్యసాచి టీమ్ వివరించింది.
- Tags
- Katrina kaif