ఇదేం వ్యవస్థ.. సర్పంచ్‌‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్

by Anukaran |   ( Updated:2021-10-02 08:27:51.0  )
ఇదేం వ్యవస్థ.. సర్పంచ్‌‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో డీఎల్పీఓ విచారణ సభకు ఉన్నతాధికారులు హాజరవ్వగా వారి సమక్షంలో సర్పంచ్ రాకేష్ పై పోలీసులు, నాయకుల సాక్షిగా ఉపసర్పంచ్ శారద చెప్పుతో దాడికి దిగిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దృష్టికి పలువురు నాయకులు శనివారం తీసుకువచ్చారు. వ్యవస్థ నడుస్తున్న తీరుపై విన్నవించి న్యాయం కోసం ప్రశ్నించారు. తనపై దాడి చేసిన అనంతరం పోలీసులు మళ్లీ బైండోవర్ చేయడం న్యాయమేనా..? అని అడిగారు. ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యేను కోరారు.

Advertisement

Next Story