శ్రీకాకుళం మత్స్యకారుల గురించి ముగ్గురికి వెంకయ్యనాయుడు ఫోన్

by srinivas |
శ్రీకాకుళం మత్స్యకారుల గురించి ముగ్గురికి వెంకయ్యనాయుడు ఫోన్
X

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారు 5,000 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీనిపై రెండు వారాల క్రితమే లేఖ రాశారు. ఆ లేఖలో వారిని కలిసేందుకు అవసరమైన నెంబర్లను కూడా ఉటంకించారు. ఈ అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు.

ఆ మత్స్యకారుల భద్రత, ఇతర అంశాలపై ఆయన ముగ్గురికి ఫోన్ చేసి వాకబు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్, సీఎం విజయ్ రూపానీతో ఫోన్‌లో మాట్లాడారు. వీరావల్‌లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వెంకయ్యనాయుడుకి విజయ్ రూపానీ చెప్పారు.

లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో సుదీర్ఘ రోడ్డు మర్గంలో కాకుండా సముద్ర మార్గంలో వారిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే విషయంపై అమిత్ షా కూడా తనతో మాట్లాడి సూచనలు చేశారని ఆయన వెంకయ్యనాయుడుకి వివరించారు. దీంతో వారి తరలింపు చర్యలు వేగవంతమైనట్టే తెలుస్తోంది.

Tags: vice president,venkaiah naidu, bjp, ap, uttarandhra, fishermen

Advertisement

Next Story

Most Viewed