- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్ అవుట్‌పై వెంకటేశ్ ముందస్తు వ్యూహం
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు తల రాతను 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ మార్చేసింది. అప్పటివరకు టీ20లు అంటే విముఖత చూపించిన బీసీసీఐ, మరుసటి ఏడాదే ఐపీఎల్ ప్రారంభించింది. దీనికంతటికీ కారణం టీ20కి ఉన్న ఆదరణను గుర్తించడమే. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జయకేతనం ఎగుర వేసిందంటే అప్పటి టీమ్‌ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంతోపాటు కోచ్ వెంకటేశ్ ప్రసాద్ వ్యూహాలు కూడా కారణమే. టీ20 మ్యాచ్‌లు టై అయితే ఇప్పుడంటే సూపర్ ఓవర్ ఆడిస్తున్నారు. కానీ, అప్పట్లో బౌల్ అవుట్ నిబంధన ఉండేది. ఫుట్‌బాల్, హాకీలో షూటవుట్ మాదిరిగా క్రికెట్‌లో బౌల్ అవుట్ నిర్వహించే వాళ్లు. అయితే, ప్రపంచకప్‌కు వెళ్లడానికి ముందు టీ20 నిబంధనలు భారత ఆటగాళ్లకు తెలియవట. కొత్త నిబంధనల గురించి తెలుసుకున్న కోచ్ ప్రసాద్, బౌల్ అవుట్‌కు ఆటగాళ్లను సిద్ధం చేశాడు. రెగ్యులర్ బౌలర్లను కాకుండా సెహ్వాగ్, ఊతప్ప వంటి వారికి బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడు. తీరా మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ టై అయ్యింది. అప్పుడు తన వ్యూహాన్ని ప్రసాద్ అమలు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ బౌలింగ్ చేసి పాయింట్లు సాధించగా, పాక్ తరఫున ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిది, యాసిర్ అరాఫత్ విఫలమయ్యారు. ఆనాటి విశేషాలను ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నాడు.