స్క్రాపింగ్ పాలసీతో లక్షల ఉద్యోగాలు

by Harish |
స్క్రాపింగ్ పాలసీతో లక్షల ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా పాత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసే విధానం వల్ల 25 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు. అంతేకాకుండా ఆటో కాంపొనెంట్ ధరలను 40 శాతం తగ్గించేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకునే చర్యల వల్ల భారత్ రానున్న ఐదేళ్లలో ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మారుతుందని ఆయన తెలిపారు. 15 ఏళ్లు, అంతకంటే పాత వాహనాల ఇంధన సామర్థ్యం తక్కువగా ఉంటాయి. అధిక నిర్వహణ ఖర్చులు ఉంటాయి కావున స్క్రాపింగ్ విధానం ఈ సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుందన్నారు. అలాగే, మహాత్మగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్‌లో పరిశోధనా, శిక్షణా సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం ఎంఎస్ఎంఈ శాఖకు రూ. 50 కోట్లను కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.



Next Story