లొకేషన్లను తెలుసుకోవడానికి ప్రత్యేక టీంలు

by Shyam |   ( Updated:2020-11-02 11:51:17.0  )
లొకేషన్లను తెలుసుకోవడానికి ప్రత్యేక టీంలు
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసే వరకు ప్రతి వాహనం లొకేషన్ తెలుసుకోవడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. ఉపఎన్నికల మొబైల్ పార్టీ వాహనాలు , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాల కదలికలను, లొకేషన్లను జీపీఎస్ సిగ్నల్స్‌ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ సరోజ్ కుమార్ టాగూర్, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ సంధ్యారాణి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉపయోగించే మొబైల్ పార్టీ వాహనాలకు జియో ట్యాగింగ్ చేయడం వలన జీపీఎస్ లొకేషన్ ద్వారా వాహనం యొక్క లొకేషన్ వెంటనే తెలుసుకోవచ్చని వారు తెలిపారు. ఎక్కడ ఏదైనా చిన్న ఘటన జరిగినా దగ్గరలో ఉన్న వాహనానికి సమాచారం అందించగానే అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించడం సులువు అవుతుందని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ప్రతి వాహనం యొక్క లొకేషన్ తెలుసుకోవడానికి సిద్దిపేట ఐటి కోర్ సిబ్బందితో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

Next Story