- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టేషన్ కానిస్టేబుళ్లే దొంగలు
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం పోలీస్ స్టేషన్ లో జరిగిన చోరీ కేసులో పోలీసులు దొంగలను గుర్తించారు. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరగడంతో ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ నారాయణ నాయక్ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.
బ్యాంకులో జమ చేయాల్సిన రూ.8లక్షలను వారం రోజుల క్రితం వీరవాసం పోలీస్ స్టేషన్ లో పోలీసులు భద్రపరిచారు. బ్యాంకులకు వరసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో వాటి గురించి ఎవరు పట్టించుకోలేదు. బ్యాంకులు తిరిగి బుధవారం నుంచి వర్క్ చేస్తుండడంతో లాకర్ లో ఉన్న రూ.8 లక్షలను డిపాజిట్ చేసేందుకు చూశారు. కానీ లాకర్ లో డబ్బులు లేకపోవడంతో పోలీసులు షాక్ తిన్నారు. పోలీస్ స్టేషన్ లోనే లక్షల రూపాయలు మాయం కావడంతో ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేపట్టి దొంగలను గుర్తించారు. అదే స్టేషన్ లో కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న గంగాచలం, గణేష్ కలిసి ఈ చోరీ చేసినట్టు తేల్చారు. శనివారం వారిద్దరిని కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను డిస్మిస్ చేస్తామని చెప్పారు.