- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ‘బ్రహ్మచారి’
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా వీర బ్రహ్మ చారిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరీ వీర బ్రహ్మచారి..
విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్‌ఎస్, ఏబీవీపీలో పని చేశారు వీర బ్రహ్మచారి. 1987లో ఎల్ఎల్‌బీ పూర్తి చేసుకున్న తర్వాత వీర బ్రహ్మ చారి జిల్లా మానవహక్కుల సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. పేద విద్యార్థుల కోసం పాలమూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సాందీపని ఆవాసం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమ కమిటీ కన్వీనర్‌గా, తెలంగాణ జేఏసీలో కో కన్వీనర్ గాను, రెండు సార్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గాను పనిచేశారు.
మరోవైపు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ రెండుసార్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గానూ పని చేశారు. రాష్ట్ర, జాతీయ నేతల పర్యటనలు, సభలు, సమావేశాల నిర్వహణలో ప్రధాన భూమికను పోషిస్తున్న వీర బ్రహ్మ చారి ప్రతి ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తూ క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు పొందిన వీర బ్రహ్మచారిని ఇటీవల జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎర్ర శేఖర్ స్థానంలో నియమించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని కల్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, జిల్లా నాయకులు కార్యకర్తలకు వీర బ్రహ్మచారి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర కార్యవర్గంలో పడాకుల బాలరాజుకు స్థానం..
భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో జిల్లా సీనియర్ నేత పడాకుల బాలరాజుకు స్థానం కల్పిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధ్యక్షునిగా వీర బ్రహ్మ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పడాకుల బాలరాజు నియామకం పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.