- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోజుకు 50 వేల పీపీఈల లక్ష్యం : వేదాంత!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతున్న స్థాయిలో రక్షణ పరికరాలు లేని సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే వైద్య రంగాన్ని ముందుగా కాపాడుకోవాలి. వైద్య రంగంలోని వారికి అవసరమైన స్థాయిలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)ను తయారు చేయడానికి దేశీయ సంస్థ వేదాంతా ప్రకటించింది. దేశంలో ఒకరోజుకు 50,000 పీపీఈల తయారీయే లక్ష్యమని సంస్థ వెల్లడించింది. మే మొదటి వారం నుంచి పీపీఈలను తయారు చేయడానికి పనులు ప్రారంభిస్తామని వేదాంతా సీఈవో రీతు తెలిపారు. దీనికోసం అవసరమైన 23 యంత్రాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి జౌళి మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకుంది. ఈ యంత్రాల ద్వారా వైద్యులకు, మెడికోలకు అవసరమైనటువంటి పీపీఈలను తయారు చేయవచ్చు. ఇవి మాత్రమే కాకుండా కొవిడ్-19ని అరికట్టేందుకు ఇప్పటికే 2 లక్షల ఎన్-95 మాస్కులను కొన్నట్లు సీఈవో రీతు పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా 50,000 పీపీఈలను సమీకరిస్తామని తెలిపారు. వేదాంత సంస్థ ఇదివరకే రూ. 201 కోట్ల విరాళం అందించిన విషయం తెలిసిందే.
Tags : vedanta, ppe, health, coronavirus, covid-19