షారుఖ్‌ను అడగకూడని ప్రశ్న

by Shyam |
షారుఖ్‌ను అడగకూడని ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా ‌షారుఖ్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న షారుఖ్.. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నా సరే, అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. #AskSRK పేరుతో చిట్ చాట్ చేస్తూ.. ఫన్నీ ఆన్సర్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. అయితే అభిమానులు ఎన్నిసార్లు అడిగినా షారుఖ్ నుంచి సరైన సమాధానం రాని ప్రశ్న మాత్రం ఒకటుంది. దాని గురించే ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. ‘దిల్ వాలే’ సినిమాలో షారుఖ్ యంగర్ బ్రదర్‌గా కనిపించిన వరుణ్.. ఖాన్‌ను ఎప్పుడూ అడగకూడని ఒక ప్రశ్న ఏమిటని అడగ్గా క్వి్క్‌గా ఆన్సర్ ఇచ్చాడు బాద్‌షా. మీరు ‘మన్నత్‌’ను ఎంతకు కొన్నారు? అనే ప్రశ్న షారుఖ్‌ను అసలు అడగకూడదన్నారు.

బాంద్రాలో ఉన్న షారుఖ్ ఖాన్ బంగ్లా పేరు ‘మన్నత్’ అన్న విషయం తెలిసిందే. రూ. 200 కోట్ల విలువ గల ఈ బంగ్లా సకల సౌకర్యాలతో కళ్లు చెదిరేలా ఉంటుందని టాక్. కాగా వరుణ్ ధావన్‌ ప్రస్తుతం కూలీ నం.1 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

Advertisement

Next Story