- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో కరోనా విజృంభణ వెనుక వేరియంట్లు
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణకు వైరస్ వేరియంట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ టాప్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో గుర్తించిన బీ.1.617 వేరియంట్ ప్రమాదకరంగా పరిణమించిందని హెచ్చరించారు. ఎందుకంటే ఈ వేరియంట్‌లోని కొన్ని మ్యుటేషన్లు ట్రాన్స్‌మిషన్‌ను ఎన్నో రెట్లు పెంచడానికి దోహదపడుతున్నాయని వివరించారు. అంతేకాదు, అవి వ్యాక్సిన్ ప్రేరేపించిన, లేదా సహయ యాంటీబాడీలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. భారీగా పెరుగుతున్న కేసులకు కేవలం వేరియంట్లే కారణం కాదని, సభలు, సమావేశాలు, పెద్దఎత్తున ప్రజలు గుమిగూడటం వంటి కారణాలూ ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మందకోడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వైరస్ కట్టడికి ప్రధాన అస్త్రం కాజాలదని స్పష్టం చేశారు. కానీ, వైరస్ ఉధృతిని అడ్డుకోకుంటే వైరస్ మరిన్ని ఉత్పరివర్తనాలు చెంది ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లు ప్రేరేపించే రోగనిరోధక శక్తినీ ఓడించగలిగే ప్రమాదకరస్థితికి వెళ్లే ముప్పు ఉన్నదని అన్నారు. తొలి వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ ప్రొటోకాల్స్‌ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీలు, ప్రచారాలు కూడా ఈ దుస్థితికి కారణమయ్యాయి. ఈ తరుణంలోనే రెండో వేవ్ రావడం, అందులోనూ కొత్త కొత్త వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉండటంతో దేశంలో రోజుకు నాలుగు లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనదేశంలో కరోనా కేసులు భారీగా పెరడగానికి కొత్త వేరియంట్లు ప్రధాన కారణంగా ఉన్నాయని స్వామినాథన్ తెలిపారు.
భారత్ లాంటి పెద్ద దేశంలో వైరస్ వ్యాప్తి స్వల్ప దశలో జరుగుతుంటుందని, కొన్ని నెలలపాటు ఇక్కడ అలాగే వ్యాపించిందని స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. క్రమంగా అది పెరుగుతూ వచ్చిందని, కానీ, తొలినాళ్లలో దాని సంకేతాలనూ పసిగట్టడంలో విఫలమయ్యారని వివరించారు. విజృంభన పీక్ స్టేజ్‌కు వెళ్లే వరకూ వైరస్ ముప్పును అంచనా వేయలేకపోయారని తెలిపారు. ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేయడం అంతసులువైన పని కాదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో వైరస్‌ను అదుపులోకి తేవాలంటే కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే అస్త్రం కాదని, దానితోపాటు కొవిడ్ ముందుజాగ్రత్తలనూ తప్పకుండా పాటించాలని చెప్పారు. ఎందుకంటే 130 కోట్లున్న భారత దేశంలో ఇప్పటి వరకు సంపూర్ణ వ్యాక్సినేషన్ కేవలం రెండు శాతం మందికే పూర్తయిందని, 70 నుంచి 80శాత మందికి టీకా వేయడానికి మరెన్నో నెలలు లేదా ఏళ్లే పట్టవచ్చునని వివరించారు. కాబట్టి, శాస్త్రీయమైన పద్ధతుల్లో కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీగా కేసులు పెరగడమే కాదు, వాటి ఫలితంగా వైరస్ మరింత ప్రమాదకరమైన కొత్త రూపాలను సంతరించుకునే అవకాశముందని, అది మరింత విపత్కర పరిస్థితులకు దారితీయవచ్చునని హెచ్చరించారు. అనేకసార్లు మ్యుటేషన్ చెందిన వేరియంట్లు చివరికి వ్యాక్సిన్‌నూ ఎదుర్కొనే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలవని, ఇది యావత్ ప్రపంచానికి ఆందోళనకరమని వివరించారు.