తప్పు చేసినట్టు తెలిస్తే ఎవరినీ వదలం : వర్ధన్నపేట ఏసీపీ

by Shyam |
తప్పు చేసినట్టు తెలిస్తే ఎవరినీ వదలం : వర్ధన్నపేట ఏసీపీ
X

దిశ, వర్థన్నపేట : నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో 50 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు పత్రాలు లేని 10 బైకులు, అకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లు సీజ్ చేసి పలువురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై యువత భవిష్యత్‌ను ఆగం చేసుకుంటున్నదని అన్నారు. మత్తు పదార్థాలను రవాణా చేసినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సాగు చేసినట్లు తేలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సదన్ కుమార్, ఎస్ఐ రామారావు, రాయపర్తి ఎస్ఐ బండారి రాజు, 50 మంది పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed