- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పైసీ టమాటో చట్నీ ప్రాసెస్.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే?
దిశ, ఫీచర్స్: తెలుగు వారు ఎక్కువగా ఇష్టపడే పచ్చళ్లలో టమాటా చట్నీ ఒకటి. టమాటలతో ఎన్నో రకాల రెసిపీలు చేసుకుని తింటారు. కానీ మన తెలంగాణ స్టైల్‌లో చేసిన టమాటా చట్నీ రుచి చూసుండరు. మెల్టింగ్ చేసే ఎరుపు రంగులో ఉండే స్పైసీ టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
పండిన టమాటాలు - 5, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, 2 వెల్లుల్లి-1, ఉల్లిపాయలు-2 సరిపడా అల్లం, ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్, ఆవాలు, కరివేపాకు- 1 టేబుల్ స్పూన్.
నోరూరించే టమాటా పచ్చడి తయారీ విధానం..
స్టవ్ ఆన్ చేసి.. పాన్‌లో ఆయిల్ వేయాలి. నూనె హీట్ అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం వేగాక.. టమాటాలు వేసుకోవాలి. అవి మెత్తబడేవరకు వేయించి, తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇంట్లో ఉండే రోకలి లో వేసి రుబ్బాలి. తర్వాత అదే పాన్ లో రెండు చెంచాల ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, గ్రాండ్ చేసిన టమాటా పేస్ట్ పాన్ లో వేసి 3 నిమిషాల పాటు ఉంచితే.. స్పైసీ టమాటో చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇక ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. మసాలా పొడిని మీ అభిరుచికి అనుగుణంగా యాడ్ చేసుకోవచ్చు.