- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాచిలర్స్ టొమాటో రసం.. చిటికెలో ఎలా తయారు చేయాలంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాచిలర్స్ ఎక్కువగా ఎగ్ ఫ్రై చేసుకోవడానికే ఇష్టపడుతారు. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగా అవుతుంది కాబట్టి. కానీ అంతకంటే ఈజీగా టొమాటో రసం చేయొచ్చని తెలుసా..? పది నిమిషాల్లో ఘుమఘుమలాడే టొమాటో రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పద్దార్థాలు..
రెండున్నర గ్లాసుల వాటర్
చిన్న ఉల్లిపాయ (ఆనీయన్) ఒకటి
చిన్న టమాటాలు రెండు
నిమ్మకాయ సైజ్ చింతపండు
పావు టీ స్ఫూన్ మెంతులు
పావు టీ స్ఫూన్ ధనియాలు
చిటికెడు పసుపు
తగినంత ఉప్పు
పావు టీ స్ఫూన్ ఆవాలు
పావు టీ స్ఫూన్ మినపగుళ్లు
పావు టీ స్ఫూన్ పచ్చి బటానీ పప్పు
నాలుగు ఎండు మిరపకాయలు
నాలుగు పచ్చిమిరపకాయలు
కరివేపాకు ఒక రెబ్బ
కొత్తిమీర రెండు రెబ్బలు
రెండు టేబుల్ స్ఫూన్ల నూనె
ఐదు వెల్లుల్లి రెబ్బలు
తయారీ విధానం:
ఓ బౌల్ తీసుకుని అందులో రెండున్నర గ్లాసుల వాటర్, తరిగిన ఉల్లిపాయ (ఆనీయన్), తరిగిన టమాట ముక్కలు, చింతపండు, మెంతులు, ధనియాలు, తరిగిన పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పావు టీ స్ఫూన్ ఆవాలు, పావు టీ స్ఫూన్ మినపగుళ్లు, పావు టీ స్ఫూన్ పచ్చి బటానీ పప్పు, నాలుగు ఎండుమిరపకాయలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే బ్యాచిలర్ టొమాటో రసం రెడీ. ఇంకేందుకు ఆలస్యం.. ఆ టేస్ట్ మీరూ చూడండి.