అజిత్ ‘వాలిమై’ : కార్తికేయ అప్‌డేట్

by Jakkula Samataha |
అజిత్ ‘వాలిమై’ : కార్తికేయ అప్‌డేట్
X

దిశ, సినిమా : కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ ‘వాలిమై’ అప్‌డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. మే 1న అజిత్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల కానుందని చిత్ర నిర్మాత బోనీ కపూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌లో మూవీ రిలీజయ్యే చాన్స్ ఉండగా.. ఇంకా ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ కావాల్సి ఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపించనుండగా.. తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలు వెల్లడించడం విశేషం. మేకర్స్ స్పెయిన్‌లో ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేశారని, అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయితే సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story