- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘అరటి రైతులను ఆదుకుంటాం’.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: పులివెందుల నియోజకవర్గం అరటి రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి మంత్రికి ఫోన్ చేసి రైతులతో మాట్లాడించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. నిన్న పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షం కురిసి దాదాపు 4 ఎకరాల్లో అరటి పంట నష్టపోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆ రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతులతో ఫోన్లో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.
ఆ తర్వాత ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్‌చేశారు. బీమాను అస్తవ్యస్తం చేసి రైతులను అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ హయాంలో రైతులకు బీమా లేదు, సూక్ష్మ సేద్యం లేదు, వ్యవసాయ యంత్రీకరణ లేదు, ఎరువులు సక్రమంగా అందలేదు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతుల కోసం తిరిగి సూక్ష్మ సేద్యం రాయితీ పై అందిస్తుందన్నారు. వడగళ్ల వాన వలన నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామన్నారు.