- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ స్టంట్స్ చేస్తూ పడిపోయిన స్టార్ హీరో.. వీడియో వైరల్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘వాలిమై’. హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సినిమా కోసం అజిత్, కార్తికేయ, మూవీ యూనిట్ ఎంత కష్టపడుతున్నారో ఇందులో చూపించగా.. అజిత్ తన స్పోర్ట్స్ బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అనుకోకుండా పడిపోయాడు. కానీ మళ్లీ కొద్దిసేపటి తర్వాత అదే స్టంట్‌ను చాలెంజ్‌గా తీసుకుని చేసి చూపించడం విశేషం.
ఇక ఆన్ రోడ్ చేజ్ సీక్వెన్స్‌ల నుంచి కదులుతున్న బస్సులో స్టంట్స్, స్పోర్ట్స్ బైక్‌లతో కూడిన యాక్షన్ వరకు అన్నీ అద్భుతంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో హ్యుమా ఖురేషి హీరోయిన్ కాగా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
- Tags
- Ajith
- karthikeya