రెడీగా ఉండండి.. వైజాగ్‌లో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్

by Shyam |
Vakeel Saab
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్ పనులు ప్రారంభించింది. వకీల్ సాబ్ నుంచి విడుదలైన మగువా మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ఫెస్ట్‌ను వైజాగ్‌లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్‌లో ఉదయం 10 గంటలకు, కాకినాడలోని కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నోలజీ కాజీలో సాయంత్రం 3:30 గంటలకు ఈనెల 23న నిర్వహించనున్నారు. కాగా, పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

https://twitter.com/SVC_official/status/1373605327459905536?s=20

Advertisement

Next Story