‘వకీల్‌సాబ్’ట్రెండ్‌ సెట్టర్..టీజర్ బ్లాక్ బస్టర్!!

by Shyam |   ( Updated:2021-01-15 01:52:40.0  )
‘వకీల్‌సాబ్’ట్రెండ్‌ సెట్టర్..టీజర్ బ్లాక్ బస్టర్!!
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘ప్రజల్లో తిరుగుతున్నాడు.. తిరిగి రాడు అనుకున్నారా? అదే తిక్క.. అదే లెక్క!!. ‘వకీల్‌సాబ్’ టీజర్‌తో వచ్చేశాడు.. యూట్యూబ్‌లో రికార్డ్స్ సెట్ చేశాడు. నంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాడు. పవర్ స్టార్ తిరిగొచ్చాడు.. పండుగకే పవర్ తీసుకొచ్చాడు’’ అంటున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. బ్రిలియంట్ అండ్ పవర్ ప్యాక్డ్ టీజర్‌తో అభిమానులకు సూపర్ శాటిస్ ఫాక్షన్ ఇచ్చిన పవన్ కల్యాణ్..ఆ స్టైల్, స్వాగ్‌తో తనను ఎవరూ మ్యాచ్ చేయలేరని మరోసారి ప్రూవ్ చేశాడు. దీంతో ఇలా కదా మాకు కావాల్సిన పవర్ స్టార్ అంటూ వకీల్‌సాబ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు అభిమానులు. 17 గంటల్లో 70 లక్షల వ్యూస్ అండ్ రియల్ టైం కౌంటింగ్‌తో దూసుకుపోతున్న ‘వకీల్ సాబ్’ టీజర్.. 7.3 లాక్ లైక్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. బాస్ క్లాస్‌గా కనిపించినా.. మాస్ మాత్రం ఎక్కడా తగ్గలేదంటున్న ఫ్యాన్స్.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని చెప్తున్నారు.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ‘వకీల్‌సాబ్’కు బోనీ కపూర్, దిల్ రాజు నిర్మాతలు. కాగా, చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు. టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా..విజువల్స్ సినిమాకు అసెట్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సినీ సెలెబ్రిటీలు. హిందీ మూవీ ‘పింక్’కు మాసీ, కూల్, స్టైలిష్ వెర్షన్‌గా వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రికార్డ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో వేగంగా మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్లలో RRR నుంచి ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం’ వీడియో మొదటి స్థానంలో ఉండగా..‘వకీల్‌సాబ్’ టీజర్ రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story