అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’.. అప్పటి నుంచే!

by Anukaran |   ( Updated:2021-04-27 05:29:22.0  )
Vakeel Saab
X

దిశ, సినిమా :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ మూడేళ్ల బ్రేక్ తర్వాత ‘పింక్’ రీమేక్‌గా వచ్చిన సినిమా బాక్సాఫీసు రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా మహిళలకు కనెక్ట్ అయిపోయిన మూవీ ఓటీటీలోకి ఎంటర్ కానుంది. ఏప్రిల్ 30 నుంచి అమెజాన్‌ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా న్యూ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమాకు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు కాగా.. నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. మూడేళ్లుగా జనసేనానిగా పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్.. ‘వకీల్ సాబ్‌’తో మళ్లీ ఫ్యాన్స్‌కు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాడు. అంతేకాదు వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.

Advertisement

Next Story