- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఆస్థానంలో.. వైకుంఠ రథానికి డ్రైవర్ లేడంట…
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీలో వైకుంఠ రథం ఉండి లాభం లేకుండా పోయిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ బొల్గం నాగరాజు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నబోనాలకు చెందిన ఎర్రం పద్మ గుండెపోటుతో మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు వైకుంఠ రథం కొరగా.. పంపించేందుకు డ్రైవర్ లేడన్న సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కరాలు చేశామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో వైకుంఠ రథానికి డ్రైవర్ లేడంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నాగారాజు గౌడ్ అన్నారు. వందల కోట్లు అభివృద్ధి పేరిట ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కనీస వైకుంఠ రథానికి డ్రైవర్ను పెట్టె పరిస్థితుల్లో లేదా అని ప్రశ్నించారు. 3 వైకుంఠ రథాలు ఉంటే కేవలం ఒక డ్రైవర్ ను నియమించడం వల్ల సామాన్యులకు సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు.