- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమన్ సేఫ్టీ ‘షీ టీమ్’ ఇన్ వడోదర
దిశ, ఫీచర్స్: మహిళల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌తో తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. తాజాగా ఇదే పేరుతో గుజరాత్, వడోదరలో పోలీసులు మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇందుకు వడోదరలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని, అతివలు తమ సమస్యలు, నేరాలపై ఏ సమయంలోనైనా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని వడోదర సిటీ పోలీస్ కమిషనర్ శంశీర్ సింగ్ చెప్పారు. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. నేరాల తగ్గుదలకు ఈ కేంద్రంలో పని చేసే బృందం కృషి చేస్తుందని, మహిళలతో పాటు సీనియర్ సిటిజన్లకు ఈ కేంద్రం ద్వారా సేవలందించనున్నట్లు పేర్కొన్నారు.