- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ‘డ్రోన్’లతో వ్యాక్సిన్ సరఫరా
దిశ, తెలంగాణ బ్యూరో : డ్రోన్‌ల ద్వారా మందులను ఒక చోటి నుంచి మరో చోటికి రవాణా చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రత్యేక అనుమతులు ఇచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ దూర ప్రాంతాలకూ (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్) వినియోగించుకోడానికి శుక్రవారం అనుమతి ఇచ్చింది. మానవ రహిత విమానాల వినియోగం చట్టంలోని నిబంధనలను సడలిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా అనుమతులు రావడంతో ఈ నెల చివరి నుంచే డ్రోన్‌ల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను రవాణా చేయాలన్న ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకోసం వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని కేంద్ర బిందువుగా చేసుకోవాలనుకుంటోంది.
ప్రస్తుతానికి కేంద్ర పౌర విమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్ నుంచి అనుమతులు రావడంతో వికారాబాద్‌లోని ఎయిర్ స్పేస్‌ను వాడుకోడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనకు అనుమతి లభించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ రెండు శాఖల నుంచి అనుమతి రాగానే ఈ నెల చివరికే డ్రోన్‌ల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడాన్ని మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ విభాగ వర్గాల సమాచారం.
మొత్తం 24 రోజుల పాటు ప్రయోగాత్మకంగా డ్రోన్‌ల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను నిర్దేశిత ప్రాంతాలకు రవాణా చేయడాన్ని మొదలుపెడతామని, ఒక్కో బ్యాచ్ ఆరు రోజుల పాటు నాలుగు బ్యాచ్‌లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మొదటి బ్యాచ్‌లో తొలి రెండు రోజులు కనుచూపు మేరలో ఉన్న ప్రాంతానికి డ్రోన్ ద్వారా వ్యాక్సిన్‌ను పంపుతామని, ఫలితాలను బేరీజు వేసుకుని లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకుని ఆ తర్వాత నుంచి దూర ప్రాంతాలకు కూడా చేరవేయడం మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచే వ్యాక్సిన్‌ను ఫ్రీజర్ బాక్సుల్లో నిర్దిష్ట ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నాయి.