నా పొలిటికల్ కెరీర్‌లో ఆ మాటలు వినలేదు : వీహెచ్

by Shyam |
నా పొలిటికల్ కెరీర్‌లో ఆ మాటలు వినలేదు : వీహెచ్
X

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక పంచాయితీ తారా స్థాయికి చేరింది. బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావుతో పాటు అతని బంధువులు ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించటం.. ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టు పట్ల సిద్దిపేట పోలీసులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పొలిటికల్ వార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు స్పందించారు. ‘పోలీసులకు డబ్బులు దొరికితే దాచుకోవడం చూశా కానీ, వాళ్లే ఇంట్లో పెట్టడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని’ వ్యాఖ్యానించారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నాయకులు గంప మహేందర్, దరిపల్లి చంద్రంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక టీఅర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రస్టేజ్ ఇష్యూగా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో సోదాలకు ముందు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పడం.. ఇవ్వలేదని బీజేపీ వాళ్లు చెప్పడం చూస్తుంటే ఇద్దరు తోడు దొంగల వలే నటిస్తున్నారని అన్నారు. పోలీస్ అధికారులే తమ ఇంట్లో డబ్బులు పెట్టారని కొత్త ఆనవాయితీని బీజేపీ నాయకులు మొదలు పెట్టారని వివరించారు.

‘తన 42 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మాట వినడం ఇదే మొదటిసారి అని’ హనుమంతరావు చెప్పుకొచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని కుల సంఘాలకు టీఅర్ఎస్ పార్టీ డబ్బులు పంచిందని, బీజేపీ వాళ్లు పంచడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతోందని చెప్పారు. దుబ్బాకలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ది ఎక్కడ ఉందో చూపించాలని వీహెచ్ మండిపడ్డారు.

Advertisement

Next Story