నేను ‘కర్మ’ను నమ్ముతాను : ఉత్తరాఖండ్ సీఎం

by Shamantha N |
utterakhand-cm
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలకవ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం అధికారిక నివాసంలోకి మారారు. ఇది ‘జిన్స్కెడ్’గా ప్రసిద్ధి చెందినది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేను కర్మను నమ్ముతున్నానని వెల్లడించారు.

అయితే, సీఎం అధికారిక నివాసాన్ని ఉపయోగించకుండా వదిలేయడం అంటే రాష్ట్ర వనరులను వృధా చేయడమే అని అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, ఈ ఇంట్లో ఉన్న గత ముఖ్యమంత్రులు తమ పదవీ కాలన్నీ పూర్తి చేయకుండానే తప్పుకున్నారు. కాగా, పుష్కర్ సింగ్ ధామి కంటే ముందున్న తీరత్ సింగ్ రావత్ ఈ ఏడాది మార్చి 10న ప్రమాణ స్వీకారం చేసి కేవలం నాలుగు నెలల్లోనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed