- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు.. నాటకంలో భాగమే అంటున్న పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడు ఆయుష్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బుధవారం తెల్లవారుజామున లక్నోలోని మదివాయ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగే ఆయుష్ ఉదయపు నడకకు వెళ్లగా అక్కడికి బైక్‌పై వచ్చిన దుండగులు అతడిపై పిస్తోల్‌తో కాల్చారు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆయుష్‌కు ఛాతిపై తీవ్ర గాయలవడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.
ఇదిలాఉండగా కాల్పుల ఘటన నాటకమేనని తెలుస్తున్నది. తన ప్రత్యర్థులను కేసులో ఇరికించేందుకే ఆయుష్ ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆయుష్‌ను కాల్చింది అతడి బావేనని తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారించగా ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయుష్‌పై కాల్పులు జరిపింది తానేననీ, ఆయనే తనతో ఈ పని చేయించాడని నిందితుడు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూపీలోని మోహన్‌లాల్ గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌశల్ కిషోర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కాల్పుల ఘటన ఎలా జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఆయుష్ తన భార్యతో కలిసి విడిగా ఉంటున్నాడని చెప్పారు. ఆయుష్ తల్లి జయదేవి కూడా మలిహాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.