- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం.. సీఎం కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. రిషబ్ పంత్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు పంత్‌తో మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం ధామి మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌కు చెందిన టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను స్టేట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. పంత్ యువకులను క్రీడల వైపు ప్రోత్సహించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫిట్‌నెస్ వైపు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని పంత్ వెల్లడించాడు. కాగా, రిషబ్ పంత్ 1997, అక్టోబర్ 4వ తేదీన ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జన్మించాడు.
ఇదిలా ఉండగా సౌతాఫ్రికా టూర్‌లో పంత్ సాధన ప్రారంభించాడు. భారత్, సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 26వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
भारत के बेहतरीन क्रिकेट खिलाडियों में से एक, युवाओं के आदर्श और उत्तराखण्ड के लाल श्री ऋषभ पंत जी को हमारी सरकार ने राज्य के युवाओं को खेलकूद एवं जन- स्वास्थ्य के प्रति प्रोत्साहित करने के उद्देश्य से "राज्य ब्रांड एंबेसडर" नियुक्त किया है। @RishabhPant17 pic.twitter.com/7vVyoXUmwP
— Pushkar Singh Dhami (@pushkardhami) December 19, 2021