రిప్డ్ జీన్స్ పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన సీఎం

by Anukaran |   ( Updated:2021-03-20 01:08:05.0  )
రిప్డ్ జీన్స్ పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: తాను చేసిన రిప్డ్ జీన్స్ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు. కానీ అదే సమయంలో జీన్స్‌తో తనకు ఎటువంటి సమస్య లేదని, కానీ ‘చిరిగిన’ వాటిని ధరించడం సరైనది కాదు అని చెప్పారు. గతంలో తాను చేసిన రిప్డ్ జీన్స్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

ఇటీవల సీఎం తీరత్ సింగ్ మాదకద్రవ్యాల వినియోగంపై ఓ వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ.., ‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. మనం దేనిని ఫాలో అవుతామో… పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు’ అని తీరత్ సింగ్ రావత్ పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడంతో క్షమాపణలు తెలిపారు. కానీ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పడం మరోసారి హాట్ టాపిగ్గా మారింది.

Advertisement

Next Story

Most Viewed