- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ సర్కార్‌పై శివసేన ఫైర్
ముంబయి: వికాస్ దుబే గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘటనను పేర్కొంటూ శివసేన ఉత్తరప్రదేశ్ సర్కారుపై విమర్శలు కురిపించింది. నేపాల్‌తో ప్రస్తుత పరిస్థితుల తరుణంలో వికాస్ దుబే ఆ దేశానికి పారిపోయినట్టు రిపోర్టులు వస్తున్నాయని, దుబే నేపాల్ దావూద్ (ఇబ్రహీం)గా మారకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. శివసేన మౌత్‌పీస్ సామ్నాలో కరుకైన ప్రశ్నలతో యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఈ ఘటన బట్టబయలు చేసిందని, 2017లో యోగి ఆదిత్యానాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం మారిందని ప్రశ్నించింది. గ్యాంగ్‌స్టర్‌లను ఎన్‌కౌంటర్‌లో హతమార్చే జాబితాగా పేర్కొనే దానిలో వికాస్ దుబే పేరు ఎందుకు యోగి సర్కారు ఎక్కించలేదని అడిగింది. మూడేళ్ల యోగి సర్కారు పాలనాకాలంలో 113 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు గానీ, దుబే అక్రమంగా కట్టిన బిల్డింగ్ ఇప్పుడు కనిపించిందా? అంటూ నిలదీసింది. ఉత్తమ ప్రదేశ్‌గా తరుచూ పేర్కొనే ఉత్తరప్రదేశ్‌కు ఇప్పుడు పోలీసుల రక్తపు మరకలంటాయని విమర్శలు సంధించింది.